చిత్ర వేలకొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలు రికార్డు చేసిన గాయని . తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయపురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్య గాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకున్న సినిమాలు
- 1986 - సింధుభైరవి, తమిళ సినిమా
- 1987 - నఖక్షతంగళ్, మలయాళ సినిమా
- 1989 - వైశాలీ, మలయాళ సినిమా
- 1996 - మిన్సార కనువు, తమిళ సినిమా
- 1997 - విరాసత్, హిందీ సినిమా
- 2004 - ఆటోగ్రాఫ్, తమిళ సినిమా
ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 7 అవార్డులు,
తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు,
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది.
ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది.
ఈమె పాడిన పాటల్లో చాలా పాటలు నాకు ఇష్టమైనవి ,మళ్ళీ మళ్ళీ వినే పాటలు చాలా వున్నాయి.
రాజి గారు.. ఇప్పుడే మీ బ్లాగు చూసాను... మీ ఓపికకి, అభిరుచికి నా జోహార్లు... చక్కటి ముచ్చటయిన పాటలన్నిటిని గుదిగుచ్చి ఒక చోట పెట్టారు. అవి పాడుకుంటుంటే మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మరిన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు ఇక్కడ ఉంచుతారని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిజగదీష్
ఎస్పీ జగదీష్ గారూ మీకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండినా సరిగమలు...గలగలలు బ్లాగ్ లో ఒక మంచి కామెంట్ ఇచ్చిన మొదటి వ్యక్తి మీరు.
నాకు చాలా ఇష్టమైన నా సంగీత ప్రపంచం మీకు కూడా నచ్చినందుకు,
మీ ప్రొత్సాహానికి మరోసారి ధన్యవాదాలు...
అందరికీ నచ్చే మంచి పాటలను ఈ బ్లాగ్ లో పెట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.