.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, సెప్టెంబర్ 2010, శనివారం

డైరెక్టర్ వంశీ 's All Time Best Songs



సహజమైన కధలు,హృదయానికి హత్తుకునే సంగీతం,గోదావరి గలగలలు సినిమా చూడగానే... ఇది వంశీ సినిమా అని చెప్పగలిగేలా వుంటాయి దర్శకుడు వంశీ గారి సినిమాలన్నీ. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ సినిమాల్లో హీరోయిన్ మేకప్ ప్రధాన ఆకర్షణ.హీరోయిన్ పెట్టుకునే పెద్ద బొట్టు,కాటన్ చీరలు,పొడుగుజడ తెలుగుదనం వుట్టి పడేలా వుంటుంది. ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యం,వంశీ సినిమాల్లో పాటలు నాకు చాలా నచ్చుతాయి. నాకు ఇష్టమైన కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం" లో

























  


























11 కామెంట్‌లు:

  1. బాగున్నాయండీ. వదిలివేసిన సినిమాలు: కొంచెం టచ్లోవుంటే చెప్తా, లాయర్ సుహాసిని, ప్రేమ&కో (?) - అందులో అంత మంచిపాటలున్నట్లు లేవులేండీ.

    రిప్లయితొలగించండి
  2. JB - జేబి.గారూ ముందుగా నా పోస్టింగ్ మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ మీరు చెప్పిన ఆ మూడు సినిమాలు వదిలేయలేదండీ.
    ఎందుకంటే వంశీ గారి ప్రతి సినిమాలో కనీసం ఒక్క పాట ఐనా నాకు నచ్చుతుంది.
    ఈ పోస్టింగ్ పెట్టినప్పుడు ఈ సినిమా పాటల వీడియోస్ దొరకలేదు.
    అందుకే 20 సాంగ్స్ మాత్రమే పోస్ట్ చేసాను.
    మీ కామెంట్ చూసిన తర్వాత ఈ సినిమాల్లోని ఆడియో సాంగ్స్ తో పోస్టింగ్ అప్ డేట్ చేసాను.
    నా పోస్టింగ్ కంప్లీట్ కావడానికి సహకరించిన మీ కామెంట్ కి నా ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  3. రాజిగారు, మిగతా పాటలు పెట్టినందుకు కృతజ్ఞతలండి.

    ఈ మూడు సినిమాలూ నేను చూసినా నాకెందుకో ఒక్క పాట కూడ గుర్తులేదు. కానీ మొన్నొక కార్యక్రమంలో వంశీగారు లాయర్ సుహాసినిలోంచి ఈ పాట చెప్పినపుడు, అరే ఈ పాట రేడియోలో చాలా సార్లు విన్నాకదా అనిపించింది. మీరు ఆ కార్యక్రమం చూశారా - 'మా'లో 'ఈ పాట ఎలా పుట్టింది?' : http://www.youtube.com/watch?v=vTDC9lhLHOo

    రెండో భాగం ఈ ఆదివారం అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  4. JB - జేబి గారూ థాంక్స్ అండీ..
    లాయర్ సుహాసిని సినిమాలో ఈ పాట నాకు చాలా ఇష్టం అండీ.
    కానీ ఎందుకో నాకు గుర్తు రాలేదు.
    మీరు చెప్పిన తర్వాత చాలా వెతికి ఆడియో పెట్టాను.
    మా టీవీ లో ఈ ప్రోగ్రాం నేను చూడలేదండీ.
    youtube link ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. JB - జేబి గారూ ప్రోగ్రాం 2parts చూశానండీ...
    గుర్తుంచుకుని youtube link ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. ఒక విషయమై అభిరుచి వున్నవారు పంచుకోవడానికే కదండీ బ్లాగులన్నవి.

    ~ జేబి.

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.