.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, డిసెంబర్ 2010, బుధవారం

కొంటెబొమ్మల బాపు - All Time Best Songs




 బాపు బొమ్మలు 

కొంటె బొమ్మల బాపు 
కొన్ని తరముల సేపు 
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!  

బాపు గారి అభిమానిగా బాపు బొమ్మలతో పాటూ ఆయన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం . హీరోయిన్ అంటే కేవలం అందానికే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎన్ని సమస్యలు వచ్చినా ఓర్పుతో,సహనంతో పరిష్కరించుకునే పాత్రలనే సినిమాల్లో బాపు బొమ్మలుగా మలిచారు.సాక్షి నుండి శ్రీ రామరాజ్యం దాకా నాకు తెలిసిన ఆయన సినిమాలన్నీ "ఆరుద్ర" గారన్నట్లు కొన్ని తరాల పాటు గుండెల్లో నిలిచిపోయే ఆణిముత్యాలే ..  ఆ కొంటె బొమ్మల మన బాపు గారు  తీసిన కొన్ని బొమ్మల్ని నా "సంగీత ప్రపంచం"లో చూడండి. 






ముత్యాలముగ్గు - 1975



శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ - 1976

 భక్తకన్నప్ప - 1976


 గోరంతదీపం - 1978


 తూర్పు వెళ్ళే రైలు - 1979

వంశ వృక్షం - 1980

 రాధాకళ్యాణం - 1981

 మంత్రిగారి వియ్యంకుడు - 1983

 సీతమ్మపెళ్లి  - 1984

బుల్లెట్ - 1985

జాకీ - 1985

 పెళ్ళిపుస్తకం - 1991


మిష్టర్ పెళ్ళాం - 1993


 రాధా గోపాళం - 2005


 సుందరకాండ - 2008

 శ్రీరామరాజ్యం - 2011




2 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్స్ చాల బావున్నాయండీ
    ప్రతి అనుభూతినీ అందంగా పదిలపరచుకుంటున్నారు
    అభినందనలు

    రిప్లయితొలగించండి
  2. లత గారూ నా అందమైన అనుభూతులు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.