సంపెంగ ముద్దు నా చెంపకద్దు ..హా
ఏ ముద్దులో ఏమున్నదో
ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో ... ఏమో
అందాల బుగ్గ మందార మొగ్గ ..హా
ఏ ముద్దుకి ఏమిస్తవో
ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో ... ఏమో
పెదవుల్లో నీ ప్రేమ తాకితే
ఝుమ్మంది వయ్యారం
ఎద మీద ఎద పెట్టి వాలితే
పొంగింది నీ అందం
పైర గాలి సోకితే పైట కాస్త జారగా
నవ్వగానే తుమ్మెద మోవి మీద వాలగా
ముద్దుల్లో ముప్పూట తేలించి లాలించి
వద్దన్నా వలపుల్ల వాకిళ్ళు తెరిపించే
శృంగారాల సంధ్యారాగాలెన్నో పలికే
సంపెంగ ముద్దు నా చెంపకద్దు ..హా
ఏ ముద్దులో ఏమున్నదో
ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో ... ఏమో
అందాల బుగ్గ మందార మొగ్గ ..హా
మబ్బుల్లో జాబిల్లి దాగితే
నవ్వింది కార్తీకం
కౌగిట్లో దోపిళ్ళు సాగితే
కవ్వించే సాయంత్రం
చూడలేని అందము
చూపు దొంగిలించగా
తేలి రాని వెన్నెల తెల్లవారి కాయగా
పొదరిళ్ళ వాకిళ్ళ సొగసంతా ముగ్గేసి
ముంగిళ్ళు ముద్దుల్తో ఎంగిళ్ళు చేసేసి
సౌందర్యాల దీపాలెన్నో నాలో నింపే
అందాల బుగ్గ మందార మొగ్గ ..హా
ఏ ముద్దుకి ఏమిస్తవో
ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో ... ఏమో
చిత్రం - కిరాతకుడు (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, S.జానకి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి