భోగి పండుగ శుభాకాంక్షలు
భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము
రేగు పండ్లే భోగిపళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు
భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము
రేగు పండ్లే భోగిపళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు
నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా
బదరీనాధుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా
నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా
బదరీనాధుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా
బదరీఫలములె తలపై పోసి భాగ్యములొందంగా
బదరీనాధుని దీవెనలొంది జన్మ తరించంగా
బదరీనాధుని దీవెనలొంది జన్మ తరించంగా
భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము
భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము
భోగిమంటలు కొత్తపంటలు మిలమిలలాడంగా
రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా
భోగిమంటలు కొత్తపంటలు మిలమిలలాడంగా
రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా
సంబరాల సంకురాతిరి శోభను కొనిరాగా
సంబరాల సంకురాతిరి శోభను కొనిరాగా
పిల్లలు పెద్దలు ఊరువాడా మోదములలరంగా
పిల్లలు పెద్దలు ఊరువాడా మోదములలరంగా
భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము
రేగు పండ్లే భోగిపళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు
భోగిపండుగ పాట
సంగీతం - భవానీ ప్రసాద్
గీతరచన - రఘురామ మూర్తి నోరి
గానం - హిమజ,మానస
సంగీతం - భవానీ ప్రసాద్
గీతరచన - రఘురామ మూర్తి నోరి
గానం - హిమజ,మానస
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి