.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, జూన్ 2020, మంగళవారం

నను నేనే మరిచినా నీ తోడు



నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు



ప్రేమా.. ప్రేమా..ఆ.. ఆ..ఆ 
ప్రేమా..  ప్రేమా..ఆ.. ఆ..ఆ

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ .. రావా 
నా వాకిట్లో .. నీకై .. నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు ప్రేమా

ఆకాశ దీపాన్నై నే వేచివున్నా
నీ పిలుపు కోసం చిన్నారీ
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారీ

నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువులేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారీ
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా  ఓ సారీ

ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా

నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా..  ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ .. రావా 
నా వాకిట్లో .. నీకై .. నే వేచానే

నను నేనే మరిచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా  ప్రియా నా  గోడు .. ప్రేమా


చిత్రం - ప్రేమదేశం(1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, O.S.అరుణ్

28, జూన్ 2020, ఆదివారం

కనులు తెరిచినా కన్నెపిల్లా


హే కనులు తెరిచినా కన్నెపిల్లా
కనులు మూసినా కన్నెపిల్లా



అల తానై అలరించేది మగువా
తనువు తానై మురిపించేది మగువా
ఒడి తానై మనిషినే మలిచేది మగువా
ఒడి తానై మనిషినె మలిచేది మగువా
నింగినైనా నేలనైనా అమూల్యమైనదీ మగువా
ఎనలేని నిధియే మగువా

హే కనులు తెరిచినా కన్నెపిల్లా
కనులు మూసినా కన్నెపిల్లా
కవిత రాసినా కన్నెపిల్లా హోయ్

కకకకక కాలేజీ స్టైలే.. హ .. కాలేజీ స్టైలే
కకక కాలేజీ స్టైలే..  కకక.. కాలేజీ స్టైలే
కకక కాలేజీ స్టైలే.. ఏఏ..ఏ..ఏ..ఏ 

కాటుక కళ్ళ కన్నె చూపు 
తస్సదియ్యా హ ఎంత కైపు
కాశ్మీర్ రోజా వేటా క్యాట్వాకింగే పూటా
ఎవ్రీడే ఫ్యాషన్ షో

కళ్ళలో సిలికాన్ గ్రాఫిక్స్ గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రాఫిక్స్
వి ఛానెల్ ఛాయిస్సూ నీ డాల్బీ వాయిస్సూ
లైటినింగ్ కళ్ళలో లేజర్
నీ లవ్ మ్యాటర్ చెప్పింది పేజర్
నే టీనేజ్ కంప్యూటర్ నువ్వే నా సాఫ్ట్ వేర్

సెల్యులార్ ఫోనుల్లాగా మీరున్నట్లైతే
బ్యాగీ ప్యాంట్ పాకెట్లోనా నైస్గా పెట్టుకుంటాం
కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లైతే
కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకొంటాం

అందాలన్నీ ఆహో ఓ ఇన్స్పిరేషన్
ఉప్పొంగదా చూస్తే యంగర్ జనరేషన్
కాలేజీ స్ట్రీటంటేనే కళ్ళల్లో మెరుపొస్తున్నాయే

డేటింగ్ కోసం డైలీ కాలేజ్ క్యాంపస్లో వేచి ఉంటాం
ఓకే అంటే శాన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం
బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ ఎన్ రోల్ ఆడేటి
సొంపైన చోటే కాలేజ్ స్ట్రీటు
ఎవ్రీడే లవ్ సీజన్స్ న్యూ ఫ్యాషన్
మేం నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే

కకకకక కాలేజీ స్టైలే.. హ .. కాలేజీ స్టైలే


చిత్రం - ప్రేమదేశం (1996)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - భువనచంద్ర
గానం - హరిహరన్, కృష్ణకుమార్

26, జూన్ 2020, శుక్రవారం

ఏమాయె నా కవిత



ఏమాయె నా కవిత 
కలలలో రాసుకున్న కవితా



నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసినా  నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

కళ్ళలో కలిసెనో అమ్మమ్మా వేకువే చెరిపెనో
కవితనెతికివ్వండి లేక నా కలను తిరిగివ్వండి
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

సంధ్య వేళలో మనసు మూల
మరుగైన మోము మది వెతికెలే
మండుటెండలో నగర వీధిలో
మసలి మసలి మది వాడెలే

మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు
మధ్య నిన్ను మది వెతికెలే
అలల నురుగులో కలల ప్రేమికుని
గుచ్చి గుచ్చి మది వెదికెలే

సుందర వదనం ఒకపరి చూచినా
మనసే శాంతించూ
ముని వేళ్ళతో నువు ఒకపరి తాకిన
మళ్ళి మళ్ళి పుట్టెదనే

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళే పడెనులే నా హృదయం
నీడ చూసినా  నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

ఒకే చూపును ఒకే మాటను
ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచ్చు మురిపాల సెగలను
ఎల్లవేళలా కోరెలే

చెమట నీటినే మంచి గంధముగ
ఎంచమనీ మది కోరెలే
మోము పైన కేశములు గుచ్చిన
తీపి హాయి చెంప కోరెలే

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

చిత్రం - ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - ఏ.ఎం.రత్నం. శివగణేష్
గానం  - K.S.చిత్ర

24, జూన్ 2020, బుధవారం

వెలిగే నీ కనులే చిట్టెమ్మా



వెలిగే నీ కనులే చిట్టెమ్మా సూర్య చంద్రులే
నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా



వెలిగే నీ కనులే చిట్టెమ్మా సూర్య చంద్రులే
నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా
వాన మేఘములే

పట్టుకరి నీలి కోక పొదిగిన వజ్రాలే
నట్టనడి నిశిలో మెరిసే నక్షత్రాలే సఖీ

పూసే మధు మాసం
నీదు సుందర దరహాసం
నీలి కడలి అలలా
నీదు హృదయం ఆవేశం

ఎల కోయిల గానం
నీదు గాత్రపు మాధుర్యం
బాలాకుమారివి చిట్టెమ్మా 
మనసు నీకంకితం

శాస్త్రము పలికేవా చిట్టెమ్మా 
శాస్త్రము లెందులకే
ఆత్రము కలవారే చిట్టెమ్మా 
శాస్త్రము చూసేదీ

పెద్దల సమ్మతితో పిదప పెళ్ళిని జరిపిద్దాం
వేగిపోతున్నా.. ఇదిగో

వెలిగే నీ కనులే చిట్టెమ్మాసూర్య చంద్రులే
నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా
వాన మేఘములే


చిత్రం - ప్రియురాలు పిలిచింది(2000)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన -  సుబ్రహ్మణ్య భారతి(తమిళ్)
శివగణేష్,ఏ.ఎం.రత్నం
గానం - హరిహరన్

22, జూన్ 2020, సోమవారం

కళ్ళగ్గంతలు కట్టద్దోయ్



కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్  
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా



వి డు ద ల.. వి డు ద ల
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల

కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

మన బతుకే బరువనకోయ్ ..  భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్  .. గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహేహేహేహే

 కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

వి డు ద ల విడుదల .. వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల .. వి డు ద ల విడుదల
ఛోడా..ఛోడా.. లాలల్లాలల్లాలల్లాల
ఛోడా..ఛోడా.. లాలల్లాలల్లాలల్లాల

మనిసిషీ మనసూ నా పక్షం మలయానిలమే నా పక్షం
చిట్టి చిలకలు నా పక్షం చెట్లూ కొమ్మలు నా పక్షం
ఎండే తమ్ములు నా పక్షం తెలుగింటమ్మలు నా పక్షం
దిక్కులెనిమిది నా పక్షం ఇది కల కాదోయ్

కడు పిరికే కత్తి ధలుకు
వీడు మాత్రం సత్యే శక్తి నమ్ముతాడోయ్
ఏకమౌతుంటే ఆకలి వర్గాలే
కొలువులు కోటలు క్షణమున మారే కాలం

కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

పోరాపో అనరాదోయ్ అది నా పతనం కాలేదోయ్
కనకం కాసు విసిరేస్తే ఆ కాసుకు ధర్మం  లొంగదులే
వెండి వానలిచ్చే మల్లె మేఘం పిలుపుకు చినుకై పడుతుందా
వ్యక్తుల  శక్తి కాసుకు బలి కాదు లొంగే పనిలేదు

వెండి వెలుగే వచ్చు వరకే
తెలవారని చీకటి  రాజ్యమురా
చురుకుమని మొదటి దిశ
చీకటింట చిచ్చు పెట్టి మాకు దక్కు వేకువమ్మా

కళ్ళగ్గంతలు కట్టద్దోయ్ కళ్ళను సైతం నమ్మద్దోయ్
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగూరా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

మన బతుకే బరువనకోయ్ ..  భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ ..  గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహేహేహేహే

వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల.. వి డు ద ల విడుదల
ఛోడా..ఛోడా.. లాలల్లాలల్లాలల్లాల
ఛోడా..ఛోడా.. లాలల్లాలల్లాలల్లాల


చిత్రం - ఇద్దరు (1997)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - హరిహరన్


20, జూన్ 2020, శనివారం

పూనగవే పూవులది లేనగవే వాగుది



పూనగవే పూవులది లేనగవే వాగుది 
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి



పూనగవే పూవులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి
పూనగవే  పూవులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి

అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళా 
నా బ్రతుకే పండగా .. నా బ్రతుకే పండగా

పూనగవే పూవులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
చేమంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒకనాడైనా శోధించవా అణువణువు ఉసురౌతాలే
అణువణువు ఉసురౌతాలే

పూనగవే పూవులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి

నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా
నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా
సూర్యుడినే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే
నా ఉసురిక నిలవదులే

పూనగవే పూవులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి
 పూనగవే పూవులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి  పూజకి

అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా


 
చిత్రం - ఇద్దరు (1997)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన -  వేటూరి
గానం - సంధ్య

18, జూన్ 2020, గురువారం

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే



వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార కలిగెనే ముద్దు కాంక్ష



వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా .. నీవే నీవేలే

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా .. నీవే నీవేలే

ఎన్నెలా కన్నులా ఏదింత మత్తెక్కించే
ఎదకే ఎదురై హిమాలెన్నో కన్నుల పూసే
నీవేదో పెట్టంగా నేనేదో పూయంగా
ఒడి చేరే ప్రేమికా ఉసురే దోచా

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా .. నీవే నీవేలే

కన్నులే మూసినా కలలో వచ్చి వయసే గిల్లు
కౌగిలే చేరితే తెలవారుతుంది కాలం
వేసంగి వెన్నెలా  వేధించే కన్నులా 
కవ్విస్తున్న కాంక్షలే కలిసే వరమా

వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నా
కారణం నేనా .. నీవే నీవేలే


చిత్రం - ఇద్దరు (1997)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - వేటూరి
గానం - ఆషా భోంస్లే 

16, జూన్ 2020, మంగళవారం

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా



శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా 



శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే 
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో  విచ్చందాలు నవ్వగనే 
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నవ మదనా నవ మదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే 
గిచ్చే మోజు మోహనమే నీదా 
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే 
గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహినీ చూపులోన మాండు రాగమేలా
మదన మోహినీ చూపులోన మాండు రాగమేలా
పడుచువాడిని కన్న వీక్షణ పంచదార కాదా 

కల ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
కల ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే 

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే 
గిచ్చే మోజు మోహనమే నీదా 
అచ్చొచ్చేటి వెన్నెలలో  విచ్చందాలు నవ్వగనే 
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా 

ఒకే ఒక చైత్ర వీణ పురే విరి  పూతలాయె
ఒకే ఒక చైత్ర వీణ పురే విరి  పూతలాయె
అమృతం కురిసిన రాతిరిలో జాబిలి హృదయం జత చేరే

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా


చిత్రం - ఇద్దరు (1997)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - వేటూరి
గానం - ఉన్ని కృష్ణన్, బోంబే జయశ్రీ 
 

14, జూన్ 2020, ఆదివారం

నా నెచ్చెలి నా నెచ్చెలి



నా నెచ్చెలి నా నెచ్చెలి ఈ దారినింక మూయకే
నా గుండెలో ఈ గాయమే ఇంకా ఆరకుండ చేయకే



నా నెచ్చెలి నా నెచ్చెలి ఈ దారినింక మూయకే
నా గుండెలో ఈ గాయమే ఇంక ఆరకుండ చేయకే
 శిలువనే శిలలనే ఇంక ఎన్ని నాళ్ళు మోయనే
చలువకై చెలువకై ఇంక ఎంతకాలమాగనే

నా నెచ్చెలి నా నెచ్చెలి ఈ దారినింక మూయకే
నా గుండెలో ఈ గాయమే ఇంకా ఆరకుండ చేయకే

నెచ్చెలీ నీ పూజలకే నా మనసులోని ప్రణయం 
నా చెలీ నువు కాదంటే  ఎద రేగుతుంది విలయం 
నా ప్రేమనే .. ఈ దేవతా కరుణించదా .. బతికించదా
అమృతం ఇలా విషమైనదా కలనేడు శిల ఐనదా

నా నెచ్చెలి నా నెచ్చెలి ఈ దారినింక మూయకే
నా గుండెలో ఈ గాయమే ఇంక ఆరకుండ చేయకే

నా కలై నువు రాకుంటె ఎద వగచి వగచి పగిలే 
నా జతే నువు లేకుంటే మది సెగల రగిలి పొగిలె 
ఓ నేస్తమా .. నా ప్రాణమా కల తీరదా .. ఓ మౌనమా 
ఇది న్యాయమా ఇది ధర్మమా ప్రేమిస్తే అది నేరమా

నా నెచ్చెలి నా నెచ్చెలి ఈ దారినింక మూయకే
నా గుండెలో ఈ గాయమే ఇంకా ఆరకుండ చేయకే
శిలువనే శిలలనే  ఇంక ఎన్ని నాళ్ళు మోయనే
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనే


చిత్రం - డ్యూయెట్ (1993)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - వెన్నెలకంటి

గానం -S.P. బాలు 

12, జూన్ 2020, శుక్రవారం

వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత



వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత చేరవచ్చిందే
గుండెలోని మూగ ప్రేమ చూసి నన్నే కోరి వచ్చిందే



వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత చేరవచ్చిందే
గుండెలోని మూగ ప్రేమ చూసి నన్నే కోరి వచ్చిందే
నిదురించే ఎదలోన రాగం ఉందీ
నా కలనైనా కనరాని అనుబంధం ఉంది

వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత చేరవచ్చిందే 

నను నిందించే తమ్ముని నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ
నను నిందించే తమ్ముని నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ

నిదురించే ఎదలోన రాగం ఉందీ
నా కలనైనా కనరాని అనుబంధం ఉంది

వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత చేరవచ్చిందే 

ఆశలతో ఊసులతో నీకోసం వేచా
నా గుండెలలో కోవెలలో నిను దేవిని చేశా
కత్తి వంటి కళ్ళతోటి
గాయం చేసి మాయం చేసిందే

నను నిందించే తమ్ముని
నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ

తన చెవికైనా చేరేనా ఈ మూగ పిలుపే
ఇక కలనైనా తీరేనా నా పేద వలపే
ఎదురు చూసే ప్రేమ గాధ
మొదలు కాక ముగిసిపోయేనా

నను నిందించే తమ్ముని
నా మూగ బాధే చూడనీ
నే వేడుతున్నా వీడిపోని బంధమేదనీ 


చిత్రం - డ్యూయెట్ (1994)
సంగీతం - ఏ.ఆర్.రెహ్మాన్
గీతరచన -  వెన్నెలకంటి
గానం - S.P. బాలు

10, జూన్ 2020, బుధవారం

కాలమే కమ్మగా సాగే గాలి పాటా



కాలమే కమ్మగా సాగే గాలి పాటా
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా



కాలమే కమ్మగా సాగే గాలి పాటా
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా
ఎక్కడా రాగం వుందో ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా

మోగే పాటా .. మోగే పాటా
అహ తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా
మోగే పాటా .. మోగే పాటా
ఇక  తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా

ఎద పాడిన పాటా సిరి మల్లెల పాటా
ఇది మోజుల్లో ఊహలు పాడిన పాటా
కాలేజీ పిల్లలు పాడే కన్నియ పాటా
కలలన్నీ నిజమైపోయే కమ్మని పాటా

ఇది తేనెల పాటా విరి వానల పాటా
హరి విల్లుల్లో మనసే వూగే పాటా
తల్లి పాలల్లే రక్తంలో ఒదిగే పాటా
తెలుగింటి వెలుగై సాగే తియ్యని పాటా

మోగే పాటా .. మోగే పాటా
అహ తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా
మోగే పాటా .. మోగే పాటా
ఇక  తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా

ఇక కాలం మొత్తం ఒక కవితై సాగే
కలలే రాగాలై సాగే లాహిరిలోనా
మా పల్లవులే పల్లకిగా పాటే సాగే
తలపుల వెల్లువలోనా నా మనసూగే

ఈ భూమే మనది విరి బాటే మనది
ఇక ఈ తలపే హృదయం అంచులు దాటే
ఆకాశాలు దాటి ఆవేశాలే పొంగేనంటా
విజయాలే మనతో నేడు వచ్చేనంటా

మోగే పాటా .. మోగే పాటా
అహ తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా
మోగే పాటా .. మోగే పాటా
ఇక  తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా

కాలమే కమ్మగా సాగే గాలి పాటా
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా
ఎక్కడా రాగం వుందో ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా

మోగే పాటా .. మోగే పాటా
అహ తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా
మోగే పాటా .. మోగే పాటా
ఇక  తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా


చిత్రం -  డ్యూయెట్  (1994)
సంగీతం - A.R.ఎ.ఆర్.రెహమాన్
గీతరచన -  - రాజశ్రీ
గానం - S.P.బాలు

8, జూన్ 2020, సోమవారం

అంజలి అంజలి పుష్పాంజలి



అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి





అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

నిన్నదాక నువ్వునేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది యిదీ
కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి

ఎదురుగ తొలి స్వప్నం తొణికినదీ 
ఎదలో మధుకావ్యం పలికినదీ 
  అంజలి అంజలి వలపు లతాంజలి


పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

కన్నుల సంకేతమె కలలకు తొలకరి
వెన్నెల జలపాతమె వలపుకు తదుపరి
గుండెలో సంగీతమె కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో

చిలువుగ ఎదమారె మధువనిగా
అమవస నిశిమారే వెన్నెలగా  
అంజలి అంజలి ఇది హృదయాంజలి

నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవియైన నీ మదికి కవితాంజలి

  అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువు లేనిదే కలలే రావులే
నా మది నువు లేనిదే కవితే లేదులే

తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని  
అంజలి అంజలి వలపు లతాంజలి

పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి


చిత్రం - డ్యుయెట్ (1991)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - వెన్నెలకంటి
గానం - S.P.బాలు,K.S.చిత్ర


6, జూన్ 2020, శనివారం

మావేలే మావేలే పరువాలు మావేలే



మావేలే మావేలే పరువాలు మావేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే



మావేలే మావేలే పరువాలు మావేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే  టీనేజీ ఇదేలే 

ప్రాయం మళ్లీ రాదు .. అరె వా మావయ్య

పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు
చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ
చిలకే ఎగిరొస్తే విదిలించుకోవద్దు
రావొద్దూ రావొద్దూ మళ్లీ మళ్లీ రావొద్దు

పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు
పడుచుకి పూవందం మరిచిపోవద్దు
లక్షలు అడిగేనా లగ్నం నేనడిగేను
ముహూర్తం పెట్టించు రేపో మాపో    

మావేలే మావేలే పరువాలు మావేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే  టీనేజీ ఇదేలే 

ప్రాయం మళ్లీ రాదు .. అరె వా మావయ్య

పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు
పెట్టొద్దూ పెట్టొద్దూ కొత్త రూలు పెట్టొద్దూ
కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దూ
పాడొద్దు పాడొద్దు హద్దుమీరి పాడొద్దు

చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే
దొరకీ దొరకనట్టు జారుకోవద్దూ
పగ్గం వెయ్యెద్దు పరువాలకిక ముందు
అనుభవించాలి నేడే నేడే 

మావేలే మావేలే పరువాలు మావేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే  టీనేజీ ఇదేలే 

ప్రాయం మళ్లీ రాదు .. అరె వా మావయ్య


చిత్రం - జెంటిల్ మాన్ (1993) 
సంగీతం -A.R.రెహమాన్ 
గీతరచన - రాజశ్రీ 
గానం  - మిని మిని

4, జూన్ 2020, గురువారం

నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో



నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో



నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే

నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట
మనసార చేరే వేళ మౌనాలే తగదంట
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట

ఆషాఢం పోయిందో గోదారి పొంగెనూ
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనూ
ఈడే సద్దు చేసెనూ

నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో 
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే
నేనే నీ ప్రాణమే

 గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేన
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను

ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి
మ్ హు హూ ..పరవశమే  

నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే
నువ్వేనా ప్రాణమే 

నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో 
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే
నేనే నీ ప్రాణమే


చిత్రం - జెంటిల్ మాన్ (1993) 
సంగీతం -A.R.రెహమాన్ 
గీతరచన - రాజశ్రీ 
గానం  - S.P. బాలు, సుజాత 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.