.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Sunday, January 8, 2012

చినుకై వరదై సెలయేటి తరగై...





చినుకై వరదై సెలయేటి తరగై
ఉరికే మదిని కడలల్లె కరిగించి కలిపేసుకున్నావు
వరమై వలపై అనుకోని మలుపై...
కలలే చూపే కనుపాప తెర మీద తొలి వేకువైనావు

తీసే ప్రతి శ్వాస...నీ తలపవుతున్నది
రేగే ప్రతి ఆశ...నువు కావాలన్నది
నా నీడ నను వీడి నిను చేరుకున్నది
నా నీడ నను వీడి నిను చేరుకున్నది
చినుకై వరదై సెలయేటి తరగై

తడి
లేని నీరున్నదేమో...సడి లేని ఎద ఉన్నదేమో..
నువు లేక నేనున్న క్షణమున్నదా...
నాలోని ఏనాటి చెలిమో...నిను చేరి మనిషైనదేమో
వేళ నిను వదిలి రానన్నదా

రూపమూ లేని ఆకాశమే నీవు
నా నీలి వర్ణాలు నిను వీడి పోలేవు
బంధమూ లేని ఆనందమే నీవు
తోడు వచ్చి నాకిపుడు...తొలి బంధువైనావు

ఆకాశమే నీతో అడుగేయమన్నది
ఆకాశమే నీతో అడుగేయమన్నది
చినుకై వరదై సెలయేటి తరగై..

మన
వలపు కథ విన్నదేమో...ఆ కలల కబురందెనేమో
ప్రతి ఋతువు మధుమాసమవుతున్నదీ
పసితనపు లోగిళ్ళలోకి...నీ మనసు నను లాగెనేమో
నా వేలు నిను వీడనంటున్నదీ

ఆరారు కాలాలు.. హరివిల్లు విరియనీ
నింగి తారల్లె.. మన ప్రేమ నిలవనీ
మనసు కొలువైన.. తొలి చోటే నీదనీ
నా కలలు నిజమవ్వగా.. విధినైనా గెలవనీ.
లోకాలు కనలేని తొలి జంట మనదనీ
లోకాలు కనలేని తొలి జంట మనదనీ

చినుకై వరదై సెలయేటి తరగై
వరమై వలపై అనుకోని మలుపై

@@@@@@@@@@

సినిమా:విలేజ్ లో వినాయకుడు
సింగర్స్ : హరిహరన్,శ్వేతా మోహన్
సంగీతం :మణికాంత్ కద్రి
లిరిక్స్ :వనమాలి

@@@@@@@@@@

0 వ్యాఖ్యలు:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.

music