.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానాఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నాఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా
తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితె నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ  ప్రశ్నయి ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనద్దు
అనొద్దు దయుంచి ఎవరూ 
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక  స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ  పూర్తవనే అవకా
తుది లేని కధ నేనుగా

గాలివాటంలాగా ఆగే అలవాటే లేక
కాలు నిలువదు ఏ చోటా 
నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేకా  .. మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనద్దు
అనొద్దు దయుంచి ఎవరూ 
ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక  స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివీ

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
 నాకే సొంతం అంటున్నా
విన్నారా..  నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్నా  అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి..  అంత దూరానున్నా వెన్నెలగా చెంతనె ఉన్నా
అంటూ ఊయలలూపింది .. జోలాలి

తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే

చిత్రం - జాను (2020)
సంగీతం - గోవింద్ వసంత 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - ప్రదీప్ కుమార్

1 వ్యాఖ్య:

  1. "నేలతో నీడ అన్నది" పాటకి COVID-19 theme తో మేము చేసిన parody ప్రయత్నాన్ని చూడండి: https://youtu.be/KRgEz5k3H7I

    ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.