.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, జులై 2020, గురువారం

ఆమని ఋతువు వచ్చినదేఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదేఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే

పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా 
ఏవో చింతలు ముసిరేనే .. మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా 

వేదనలే రగిలేనె రోదనలే మిగిలేనె
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామె
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే

చేరువనున్న చేరదురా  ఆవేదన ఇక తీరదులె
చీకటి తెర ఏదో మా నడుమా ఉన్నదే

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనే  హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో  వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట

గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినదీ
నేనిచటా బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది

కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం

ఏవో చింతలు ముసిరేనె
మనసును వికలము చేసేనె
ఎద నిండా ఏవో బాసలు మెదిలేనె హో.. హో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోట 


చిత్రం - జోధా అక్బర్ (2006)
సంగీతం -  A.R.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - శ్రీనివాస్ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.