.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

2, సెప్టెంబర్ 2019, సోమవారం

ఎవరవయా .. ఏ దివ్య భువి నుండి దిగి



ఎవరవయా .. ఎవరవయా
ఏ దివ్య భువి నుండి దిగి 
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ



చిత్రం - వినాయక విజయం  
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం - పి.సుశీల
 

1 కామెంట్‌:

  1. ధన్యవాదాలు- పాట కాపీ కావటం లేదు. అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను-

    ఎవరవయా .. ఎవరవయా
    ఏ దివ్య భువి నుండి దిగి
    ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ

    ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
    ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
    ఆ నవ్వులు పలికేవి ఏ వేదమంత్రాలో
    వేల్పులందరిలోన్నతో లివేల్పువో ఏమో
    పూజలలో మొదటి పూజ నీదేనేమో
    పూజలలో మొదటి పూజ నీదేనేమో

    ఎవరవయా ఎవరవయా
    ఏ దివ్య భువి నుండి దిగి
    ఈ అమ్మ బడిలోన ఒదిగీ
    ఎవరవయా ..

    చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులు
    చిట్టిపొట్టి నడకలు జిలిబిలి పలుకులు
    ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో
    ఎన్నెన్ని వింతలో
    ఎన్నెన్ని కోరికల నిండి నే కన్న
    ఎన్నెన్ని స్వప్నాలు పండి
    చిన్నారి ఈ మూర్తివైనావు
    ఏడేడు లోకాలు ఏలేవు

    ఎవరవయా .. ఎవరవయా
    ఏ దివ్య భువి నుండి దిగి
    ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ
    ఎవరవయా ..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.