.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ ఈశ లింగభైరవీ

సెప్టెంబర్ 29 నుండి నవరాత్రులు ప్రారంభం అవుతున్న సందర్భంగా,ఈరోజు మాచెల్లి రమ్య పుట్టినరోజు సందర్భంగా తనకి చాలా ఇష్టమైన ఈ పాటతో,ఆ జగజ్జనని దీవెనలు ఎప్పుడూ మాచెల్లికి తోడుగా వుండాలని కోరుకుంటూ 
Happy BirthDay My Dear Sister Ramya 
Many Happy Returns Of The Day


ఇషానా అనే ఆల్బమ్ పేరుతో పాప్ సింగర్ స్మిత పాడిన ఈపాట కోయంబత్తూర్ లోని సద్గురు ఇషా ఆశ్రమంలో చిత్రీకరించారు.2012 లో ఈపాట చూసినప్పటినుండి లింగభైరవి అమ్మని చూడాలని అనిపించేది.ఆ కోరిక ఈ సంవత్సరం ఆగస్టు 12 న అమ్మదర్శనంతో తీరింది.ఇషా ఆశ్రమం,ధ్యానలింగం,లింగభైరవి ,ఆదియోగి దర్శనం జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా అనిపించింది. 

Jai Maa Lingabhairavi

చిద్రూపీ పరదేవతా భగవతీ 
శ్రీ ఈశ లింగభైరవీ



ఆల్బమ్ - ఇషానా (2012)
సంగీతం - నిహాల్ 
గానం - స్మిత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.