.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

12, ఆగస్టు 2020, బుధవారం

మెరిసింది మేఘం మేఘం



మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం





మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది 

ముద్దిచ్చే వానంట మురిపించే వానంట 
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట
ముద్దిచ్చే వానంట మురిపించే వానంట 
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట

ఝల్ ఝల్  ఝల్  ఝల్  
ఝల్  ఝల్  ఝల్  ఝల్  
ఝల్ ఝల్  ఝల్  ఝల్ జల్లుల్తోనా 

మెరిసింది .. మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది 

గిలిగిలి గిలిగిలి గా హహ్హహ్హ హా .. హహ్హహ్హ హా
గిలిగిలి గిలిగా తడి తడి  మట్టేసి 
పదండి కడదాం బొమ్మరిల్లునే 

మామిడి కొమ్మ కొమ్మకు ఓ రెమ్మా 
పట్టుకు డోలలు ఊగుదమా .. హా.. 
నాగలి పట్టుకుని సాగెను సాగుబడి 
కోడెల మెడ గంట భలె  మోగెను తాళములో 

 ఆ తీరమట్టట్టా నే చేరుదులే 
 ఆ తీరమట్టట్టా నే చేరుదులే
దూర దూర తీరమేదొ చేరుతుందో ఏమో మేఘం 

తహతహలాడే కలలే కళ్ళల్లో  దాచి 
పయనిస్తున్నా  వలచే  దారుల్లో 
అడవుల మీద నా మనసే ఉంచి 
సొంత ఊరు విడిచి పోతున్నా 

కొమ్మల ఊగినవి మామిడి పూవులవే 
ముద్దుగ పాడినవీ కసి పుట్టిన కోకిలలే 
మా ఇంటి ముగ్గమ్మా నిను వీడిపోతున్నా 
నను తోడు కోరింది మరి నాలో వున్న కన్నె ప్రాయం
 
మెరిసింది మేఘం మేఘం 
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది 


చిత్రం - గురుకాంత్ (2007)
సంగీతం -  A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి 
గానం - శ్రేయాఘోషాల్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.