.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

16, ఆగస్టు 2020, ఆదివారం

నీవెవరో .. నేనెవరో



నీవెవరో .. నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో





Hey goodbye priya
కళ్లలో కల్మషం ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం

నీవెవరో .. నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో నేనెవరో

దొంగచూపుతో ఎద దోచుకున్నావు
సొట్టబుగ్గలో నను దాచుకున్నావు
మెత్తగా వచ్చి మనసు దోచి
నను చంపెయ్యమంటా

నీవెవరో .. నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో నేనెవరో

Hey goodbye priya
కళ్లలో కల్మషం ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం

ఆకుపై చినుకులా అంటనీ  తేమలా
కలవకు ఊహలా .. కలవకు ఊహలా
బ్రతకనీ నన్నిలా

నీవెవరో .. నేనెవరో కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
నీవెవరో .. నేనెవరో

అడ్డదారిలో నీ దారి కాశాను
దారి తప్పినా నే తేరి చూసాను
తొలగిపోతివంటే తంటాయే లేదు
ఇది పనిలేని పాటా 

నీవెవరో .. నేనెవరో

Hey goodbye priya  
కళ్లలో కల్మషం ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధువిషం స్పర్శలో మధువిషం
నేను కానోయ్ నా వశం

నీవెవరో .. నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలిచూపే పొరపాటో
  నీవెవరో .. నేనెవరో


చిత్రం - యువ (2004)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - వేటూరి
గానం -శంకర్ మహదేవన్,సునీతా సారధి,లక్కీ ఆలీ కార్తీక్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.