.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

18, ఆగస్టు 2020, మంగళవారం

వచ్చిందా మేఘం .. రానీ



వచ్చిందా మేఘం .. రానీ
పుట్టిందా వేడి .. పోనీ



 ఆలోచించు .. అవునా ..  ప్రియా
వచ్చిందా మేఘం .. రానీ
పుట్టిందా వేడి .. పోనీ
తెచ్చిందా జల్లు .. తేనీ  .. మనమేం చేస్తాం

ఆ..వచ్చిందా.. దారి.. రానీ
అదిపోయే చోటికి .. పోనీ
మలుపోస్తే మారదు .. దారి .. మనమేం చేస్తాం

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా

మనమేం చేస్తాం ..  మనమేం చేస్తాం

రాళ్ళను కూడా పూజిస్తారు
అవి దార్లో వుంటే ఏరేస్తారు
దారప్పోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతా చిక్కే అర్ధం చేసుకో విషయమేదో

నీ మనసేది చెబితే అది చెయ్
సరేలే నీకు నాకు ఎవరున్నారు

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా

వచ్చిందా మేఘం .. రానీ
పుట్టిందా వేడి .. పోనీ
తెచ్చిందా జల్లు.. తేనీ .. మనమేం చేస్తాం

వచ్చిందా .. దారి .. రానీ
అదిపోయే చోటికి .. పోనీ
మలుపోస్తే మారదు .. దారి ..  మనమేం చేస్తాం

కడలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పూవుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్నీ
ఏ కొందరి అడుగుజాడలో నేల మీద అచ్చౌతాయి
ఈ నీడలా చీకటి పడినా ఆ జాడలు చెరిగిపోవోయి

ఎయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు
ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా

వచ్చిందా మేఘం .. రానీ
పుట్టిందా వేడి .. పోనీ
తెచ్చిందా జల్లు.. తేనీ .. మనమేం చేస్తాం

వచ్చిందా .. దారి .. రానీ
అదిపోయే చోటికి .. పోనీ
మలుపోస్తే మారదు.. దారి ..  మనమేం చేస్తాం

విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా 


చిత్రం - యువ (2004)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - వేటూరి
గానం - అద్నాన్ సమీ,సుజాత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.