.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

14, ఆగస్టు 2020, శుక్రవారం

ఏ దేవి వరము నీవో ..ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ  చిన్నారి ముద్దు పెడితే
చెక్కిళ్ళ ముద్దు పెడితే  ఈ  చిన్నారి ముద్దు పెడితే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే .. ఆ .. ఆ ...ఆ
ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే ప్రాణ వాయువే అయినావే
మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో  చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ  చిన్నారి ముద్దు పెడితే

ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే

ఎదకు సొంతములే ఎదురు మాటవు లే
కలికి వెన్నెలవే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జనన వలయం నీవే

ఏ దేవి వరము నీవో  చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ  చిన్నారి ముద్దు పెడితే

సిరుల దీపం నీవే కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీరనీ
ఇంటి వెలుగని కంటి నీరనీ
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తి పెంచిన శోకంలా

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే .. ఏ .. ఏ.. ఏ

ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ  చిన్నారి ముద్దు పెడితే


చిత్రం - అమృత (2002)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.