.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

6, ఆగస్టు 2020, గురువారం

పూదోట పూచిందంటాపూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా

పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా

వయసేమో తుళ్ళీ విరహాలు జల్లీ
ఊరించే కన్నె కిష్ణమ్మా
దారేమో కాచీ సిగ్గు తెరతీసి
ముద్దాడ వచ్చాడయ్యా కన్నెదొంగ కృష్ణయ్యా

పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా

పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా

పొరుగింటి మీనా మురిపాల మైనా
తలపులు రేగెను సాగెను ఆశల పల్లకిలో
నా మనసే దోచి వయసే శృతి చేసి 
వలపించి గిలిగిచ్చే ఈ దోబూచేల దొంగాడల్లే  

వెంటాడీ జతగా కూడీ దాగోనేలా గోరింకల్లే
అలకిక ఏలనే చాలిక కోరిక తీరునులే

పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా

పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా

వయసేమో తుళ్ళీ విరహాలు జల్లీ
ఊరించే కన్నె కిష్ణమ్మా
దారేమో కాచీ సిగ్గు తెరతీసి
ముద్దాడ వచ్చాడయ్యా కన్నెదొంగ కృష్ణయ్యా

పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా

నీ చెంత ఉంటే ఉప్పొంగులేగా
కోయిల కూసెను ఊహలు ఊసులు పల్లవిగా
అలివేణి హొయలు అందాల సిరులు
 ఎగిరిందే సీతాకోక చిలుకల్లె ఎదగిల్లి
 పో నెలవెంక ఏల ఎంకి కూలి కిందే కథలల్లీ 

చనువును పెంచకు మగువకు
మనువే భాగ్యముగా

పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా

వయసేమో తుళ్ళీ విరహాలు జల్లీ
ఊరించే కన్నె కిష్ణమ్మా ఆఆ..
దారేమో కాచీ సిగ్గు తెరతీసి
ముద్దాడ వచ్చాడయ్యా కన్నెదొంగ కృష్ణయ్యా

పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా

పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా 


చిత్రం - వనిత (1994)
సంగీతం-  A.R. రెహమాన్  
గీతరచన - నారాయణ వర్మ
గానం - ఉన్ని మీనన్,సుజాత 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.