కొన్ని పాటలు వాటిని విన్న,చూసిన సందర్భాన్ని బట్టి కూడా ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతాయి.ఈ పాట అలాంటిదే.. మా చెల్లి ఫస్ట్ ఇయర్ కాలేజ్ లో వాళ్ళ ఫ్రెషర్స్ డే కి నన్ను కూడా రమ్మన్నారు చెల్లి,తన ఫ్రెండ్స్ .(మా చెల్లి కంటే నేనే ఎక్కువ ఫ్రెండ్ ని ఆ అమ్మాయిలకి) ఈరోజుల్లో ఫ్రెషర్స్ డే అంటేనే డాన్సులు, పాటలు కదా.. మా చెల్లి వాళ్ళ సీనియర్ ఒక అబ్బాయి ఈ పాటకి డాన్స్ వేశాడు.. అప్పటిదాకా ఎప్పుడూ ఈ పాట వినలేదు కానీ వినగానే నచ్చేసింది . ఇప్పటికీ ఆ పాట విన్నా,చూసినా ఆ రోజు ఫ్రెషర్స్ డే గుర్తొస్తుంది .. అలా నాకు ఇష్టమైన పాటల లిస్ట్ లో చేరిన పాట ఇది .లిరిక్స్, "హరీష్ రాఘవేంద్ర" స్వరం ఈ పాట ప్రత్యేకతలు
ఎవ్వరే నువ్వు నను పిలిచావు
సినిమా - రాజు భాయ్ ( 2007)
సంగీతం - యువన్ శంకర్ రాజా
లిరిక్స్ - రామజోగయ్య శాస్త్రి
గానం - హరీష్ రాఘవేంద్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి