.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, మే 2020, బుధవారం

తీ తీ తీయని ..తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువంతీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగనీ
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగనీ

ఉరికే నా కులుకే కొంటె తలపులు పలికెనులే
నా పాల వన్నెలే కన్నె వలపులు చిలికెనులే
సందేళ అందాల వంపులలో పరువము పంచేనా
నాజూకు నా చూపు చురకలలో చుక్కలను చూపేనా

సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం

జతగా కలిసి జంట గువ్వలల్లె ఎగిరిపోదాం
గాలిలో తేలి నీలి గగనము ఏలుకుందాం

విను వీధి జాబిలితొ ఆడుకుందాం 
వెన్నెలను పంచుకుందాం
స్వర్గాల తీరాలు చేరుకుందాం 
తనువులు మరిచిపోదాం

సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని
సొగసులు చిందులాడని వయసులు పొంగి రేగని

తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులా ఈల వేసె పరువం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం 


చిత్రం - దొంగ దొంగ (1993)
సంగీతం -A.R. రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం -సుజాతా మోహన్ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.